నీలకంట తాజా చిత్రం ‘మాయ’ ఫస్ట్ లుక్ మే 10 న విడుదల కానుంది. ఈ చిత్రం లో హర్ష వర్ధన్ అవంతిక సుష్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎం. వి. కె. రెడ్డి మరియు మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని షిరిడి సాయి కంబైన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు .
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మానంతరపు పనులలో వుంది. ‘విరోధి’ లాంటి సాంఘిక చిత్రం ‘మిస్టర్ మేధావి’ ‘చమ్మక్ చల్లో’ లాంటి రొమాంటిక్ చిత్రాల తర్వాత నీలకంట తన పంధా ని మళ్లీ మార్చుకున్నాడు. ‘మాయ’ ఎక్స్ట్రా సెన్సరి పెర్సేప్షన్ అనే అంశం మీద ఆధార పడింది. ఈ అంశాన్ని ‘మాయ’ చిత్రం లో ఎలా తెరకెక్కిస్తారో వేచి చూడాలి.
శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి బాల్ రెడ్డి ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని విషయాలు వెలువడాల్సి వుంది.


