“మ్యాడ్ స్క్వేర్” టైటిల్ పోస్టర్ రిలీజ్!

నార్నే నితిన్, సంగీత్ శోభన్, నితిన్ రామ్ లు ప్రధాన పాత్రల్లో, దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్ పై మేకర్స్ సరికొత్త ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రం కి మ్యాడ్ స్క్వేర్ టైటిల్ ను ఖరారు చేస్తూ, సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్.

ప్రస్తుతం ఈ చిత్రంకి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఉగాది పండుగ రోజున సినిమా ప్రారంభం కాగా, అందుకు సంబందించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సీసీరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version