18ఏళ్ల తరువాత భార్యాభర్తలు గా కలిశారు…!

18ఏళ్ల తరువాత భార్యాభర్తలు గా కలిశారు…!

Published on Jun 15, 2019 5:27 PM IST

మాధవన్, సిమ్రాన్ 18 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్నారు. రాకెట్ సైన్స్ పై పరిశోధనల్లో ఇస్రో కి సేవలందించిన సైంటిస్ట్ నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న “రాకెటరీ: ది నంబి ఎఫెక్ట్ ” చిత్రంలో ఒకప్పటి ఈ రొమాంటిక్ కపుల్ భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వీరిద్దరూ మొదటిసారి లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ దర్శకత్వంలో 2001లో వచ్చిన “పరవశం” అనే చిత్రంలో కలిసి నటించారు. అలాగే మరో చిత్రం మణిరత్నం మూవీలో కనిపించారు. తరువాత ఈ జంట మళ్లీ కలిసి నటించింది లేదు.

“రాకెటరీ: ది నంబి ఎఫెక్ట్ ” మూవీలో మాధవన్ నంబి నారాయణ్ గా మాధవన్ చేస్తుండగా, ఆయన భార్య పాత్రలో సిమ్రాన్ కనిపించనున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ మూవీకి మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండగా, షారుక్,సూర్య అతిధి పాత్రలలో కనిపించనున్నారు.దేశద్రోహం నేరం కింద ఇస్రో సైంటిస్ట్ అయిన నారాయణను 1994లో అరెస్ట్ చేయడం జరిగింది. తరువాత ఆయన నిర్దోషిగా బయటకు వచ్చి తనను అన్యాయంగా నేరంలో ఇరికించిన వారిపై న్యాయపోరాటం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు