2000 మణిరత్నం ‘సఖి’ సినిమాతో ఆకట్టుకున్న దగ్గరనుండి అమ్మాయిలకు లవర్ బాయ్ గా మాధవన్ నిలిచిపోయాడు. పక్కింటి కుర్రాడిగా లుక్, రొమాంటిక్ క్యారెక్టర్స్ ను ఎంపిక చేసుకోవడంతో మాధవన్ కు భారీ సంఖ్యలో లేడీ ఫ్యాన్స్ పెరిగారు. అయితే ఈ మధ్య వరుసపెట్టి పరాజయాలతో మనల్ని పలకరిస్తున్న మాధవన్ ఒక్కసారిగా రూపురేఖలను మార్చేసిన విధంగా కొత్త లుక్ తో ‘ఇరుధి సుత్త్రు’ ద్వారా మనముందుకు రానున్నాడు
ఈ సినిమా తమిళ, హిందీ భాషలలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం. నిన్న రాత్రి ఈ చిత్ర టీజర్ ని విడుదల చేశారు. అందులో మాధవన్ కనిపించిన రఫ్ లుక్, మ్యాచో బాడీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘మిలియన్ డాలర్ బేబీ’ ప్లాట్ నుండి స్పూర్తి పొందిన ఈ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది


