నదియా పాత్రలో మధుబాల

నదియా పాత్రలో మధుబాల

Published on Jun 27, 2014 1:50 PM IST

madhu-bala-nadhiya
ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ అంతా ఈ మధ్య కాలంలో కీలక పాత్రల్లో కనిపిస్తూ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలా వచ్చిన వారే నదియా, మధుబాల, రేవతి, రవీనా టాండన్ మొదలైన వారు.. ‘అంతక ముందు ఆ తరువాత’ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన మధుబాల త్వరలో ‘అత్తారింటికి దారేది’ కన్నడ రీమేక్ ద్వారా కన్నడలో రీ ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ రీమేక్ లో తెలుగులో నదియా పోషించిన సునంద పాత్రలో మధుబాల కనిపించనుంది. పవన్ కళ్యాణ్ పాత్రలో హీరో సుదీప్ నటించనున్నాడు. దీని ప్రకారం సుదీప్ కి అత్త పాత్రలో మధుబాల కనిపించనుంది. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. సుదీప్ ఇటీవలే ‘మిర్చి’ సినిమాని కన్నడలో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ‘అత్తారింటికి దారేది’ రీమేక్ తో మరో హిట్ అందుకునే అవకాశం ఉంది.

తాజా వార్తలు