హ్యాపీ హ్యాపీగా ఉన్న మధుర శ్రీధర్

హ్యాపీ హ్యాపీగా ఉన్న మధుర శ్రీధర్

Published on Feb 4, 2015 8:33 AM IST

Madhura-Sreedhar1

చిన్న సినిమాల దర్శకుడు మరియు నిర్మాత మధుర శ్రీధర్ ప్రస్తుతం చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. దానికి కారణం ఆయన నిర్మించిన ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ సినిమా మంచి సక్సెస్ ని అందించి ఆయన కమర్షియల్ ఫెయిల్యూర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. అలాగే ఈ సినిమా మధురకి లాభాలను కూడా తెచ్చి పెట్టింది.

చాలా లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ దాంతో ఈ సినిమా బడ్జెట్ చాలా ఈజీగా రికవరీ అయిపొయింది. అలాగే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఈ సినిమాకి అదనపు బోనస్ అని చెప్పాలి. అలాగే ఈ సినిమా రీమేక్ రైట్స్ కూడా సినిమాకి మరింత లాభాన్ని తెచ్చిపెట్టాయి. వీటితో మధుర శ్రీధర్ ఎంతో ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. వీటన్నిటికంటే మించి ఈ సినిమా మధుర శ్రీధర్ కి ఓ కొత్త లైఫ్ ని ఇచ్చింది. ఈ ప్రోత్సాహంతో ఫ్యూచర్ లో ఆయన మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు