
దర్శకనిర్మాత మధుర శ్రీధర్ ఈ రోజు మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. తన వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ‘ఓం మంగళం మంగళం’ అనే సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.
నిర్మాతగా మధుర శ్రీధర్ వరుసగా సినిమాలను నిర్మిస్తున్నారు. లో బడ్జెట్లో కొత్త కథ, కథనం ఉన్న సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. జాతీయ ఉత్తమ దర్శకుడు నీలకంఠ దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మించిన ‘మాయ’ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. మరో సినిమా ‘లేడీస్ & జంటిల్ మెన్’ నిర్మాణంలో ఉంది. ఇటివల విడుదల చేసిన ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ యువతను ఆకట్టుకుంది. ఈ సాంగ్ లిరిక్స్ మరియు రఘు కుంచెపై పలువురి ప్రసంశలు కురిపించారు.

