రేపటి నుండి శృతి హాసన్ స్పెషల్ సాంగ్.!

రేపటి నుండి శృతి హాసన్ స్పెషల్ సాంగ్.!

Published on Jul 2, 2014 10:43 AM IST

Mahesh-Babu_Shruti-Hassan
తెలుగుతెరపై తొలిసారిగా ఒక ప్రత్యెక గీతంలో కనిపించడానికి శృతి హాసన్ రెడీ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, తమన్నా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆగడు’. దూకుడు వంటి భారి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల కలయికలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొన్నాయి. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు.

‘ఆగడు’ సినిమాలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట చిత్రీకరణను రేపటి నుండి మొదలుపెడుతున్నారు. స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ అదిరిపోయే పెర్ఫార్మన్స్ చూడాలంటె సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే. ఐటెం సాంగ్ కోసం కోసం తమన్ అదిరిపోయే ట్యూన్ రెడీ చేసాడంట. సంగీత దర్శకుడిగా తమన్ కు ‘ఆగడు’ 50వ సినిమా. అందుకే ‘ఆగడు’పై ప్రతేక శ్రద్ధ పెడుతున్నాడు.

తాజా వార్తలు