సంక్రాంతి తర్వాత తెలుగులో ‘మగ మహారాజు’..?

సంక్రాంతి తర్వాత తెలుగులో ‘మగ మహారాజు’..?

Published on Jan 9, 2015 5:04 PM IST

Maga-Maharaju
విశాల్, హన్సిక జంటగా సుందర్ సి దర్శకత్వం తెరకెక్కిన తమిళ సినిమా ‘అంబాల’. తెలుగులో ‘మగ మహారాజు’ పేరుతో అనువదిస్తున్నారు. నేడు ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. హిప్ హాప్ తమీజ సంగీత దర్శకుడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయిన దగ్గుబాటి రానా ఆడియో ఆవిష్కరించి చిత్ర బృందానికి అందజేశారు. విశాల్, హన్సిక, వైభవ్, శ్రేయ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తమిళంలో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేస్తున్నట్టు నిర్మాత విశాల్ ఆడియో వేడుకలో ప్రకటించారు. త్వరలో తెలుగులో కూడా విడుదల చేస్తామని చెప్పారు. ‘గోపాల గోపాల’, శంకర్ ‘ఐ’ సినిమాలకు భారి క్రేజ్ నెలకొనడంతో సంక్రాంతి తర్వాత విడుదల చేయాలనీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. విశాల్ గత సినిమా ‘పూజ’ తెలుగులో విజయం సాదించడంతో ‘మగ మహారాజు’పై అంచనాలు బాగున్నాయి.

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ విశాల్ కు అత్తగా నటించారు. వీరిద్దరూ కలిసి ఒక పాటలో సందడి చేయనున్నారు. మరో ఇద్దరు మాజీ హీరోయిన్లు ఐశ్వర్య, కిరణ్ లు సైతం విశాల్ కి అత్తలుగా నటించారు. మధురిమ, మాధవి లత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను విశాల్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు