“మగధీర” సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందంటే?

Published on Jul 2, 2021 2:12 am IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి “మగధీర” సినిమా నిజంగా మరిచిపోలేని హిట్ అనే చెప్పాలి. ఎందుకంటే హీరోగా చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్‌కి ఆ సినిమా ఆశించినత ఓపెనింగ్ ఇవ్వలేకపోయింది. అయితే దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రెండో సినిమాగా చరణ్‌ చేసిన మగధీర సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో మెగా పవర్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. 400 ఏళ్ల నాటి ప్రేమ కథను, 21వ శతాబ్దానికి లింక్ చేసి మగధీరతో పూర్తి స్థాయిలో సక్సెస్ అందుకున్న రాజమౌళి దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సీక్వెల్‌కు రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్ షూటింగ్ పూర్తి అయ్యాక డైరెక్టర్ శంకర్‌తో ఒక మూవీ చేస్తారని, ఇక రాజమౌళి కూడా మహేష్ బాబుతో ఒక మూవీ చేస్తారని, ఆ రెండు సినిమాలు అయిపోగానే రాజమౌళి, రామ్ చరణ్ కలయికలో మగధీర-2 రూపుదిద్దుకోబోతుందన్న మాటలు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :