“మహా సముద్రం” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్

Published on Sep 22, 2021 7:48 pm IST


శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మన్యూల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మహా సముద్రం. ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ ను రేపు సాయంత్రం 06:03 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.

RX 100 లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం లో వస్తున్న సినిమా కావడంతో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హీరో సిద్దార్థ్ సైతం చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తుండటంతో ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, పాటలు ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి. ట్రైలర్ విడుదల తో సినిమా ఎలాంటి క్యూరియాసిటి సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :