స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. !

Published on Jun 25, 2019 12:00 am IST

రంజీత్, సౌమ్య మీనన్ లకు హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ పత్తికొండ కుమారస్వామి నిర్మాణ సారధ్యంలో యం. రవికుమార్ నిర్మిస్తున్న చిత్రం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంతో రామకృష్ణ మైలా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ ను దర్శకుడు విజయ్ కుమార్ కొండా మూవీ డైరెక్టర్ రామకృష్ణ కు అందివ్వగా, కెమారా స్విచ్ఛాన్ నిర్మాత భరత్ చేసారు.

సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ క్లాప్ ఇచ్చి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో చిత్రం రూపొందుతుందని చిత్రబృందం తెలిపింది.

సంబంధిత సమాచారం :

X
More