నేటితో 25 రోజులు పూర్తి చేసుకోనున్న మహానటి !

నేటితో 25 రోజులు పూర్తి చేసుకోనున్న మహానటి !

Published on Jun 3, 2018 4:52 PM IST

సావిత్రి జీవిత కథ తో తెరకెక్కిన సినిమా మహానటి. మంచి అంచనాల మధ్య గత నెల 9న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు ఎలాంటి అవరోధాలు లేకుండా దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.నేటితో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకుంటుంది . కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ జెమిని గణేశన్ పాత్రలో నటించారు. నిజానికి ఈ పాత్రలు వీరు చేస్తున్నప్పుడు కొన్ని విమర్శలు కూడా చేశారు . అలనాటి నటి సావిత్రి పాత్ర కీర్తి చేయడమెంటి ఆ పాత్రలో ఆమె మెప్పిస్తుందా అని చాలా మందికి అనుమానాలు రేకెత్తాయి . వీటినంటిని పటా పంచలు చేస్తూ సినిమా విడుదల తరువాత కీర్తి తప్ప సావిత్రి పాత్ర ను ఇంత బాగా ఎవరు చేయలేరని అన్నారు .

ఇక మహానటి ఏ స్థాయి విజయమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగు ఇండస్ర్టీ లోని ప్రముఖులు మహనటి టీం సత్కరించారు. కీర్తి ,దుల్కర్ ల నటన , నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడానికి కృషి చేశాయి.ఇప్పటికి ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంటుంది. మహనటి రిలీజ్ తరువాత ఇప్పటివరకు విడుదలైన చిత్రాలు ఏవి ప్రేక్షకులను అక్కట్టుకోక పోవడం తో ఈ సినిమా ని రెండవ సారి చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు.

తాజా వార్తలు