క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందిన ‘మహానటి’ !

అలనాటి స్టార్ నటీమణి సావిత్రి జీవితానికి దృశ్య రూపాన్ని ఇస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని కూడ ముగించుకుంది. సెన్సార్ సభ్యులు చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు.

ఈ నెల 9వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ట్రైలర్, పాటలు అన్నీ బాగుండటంతో సినిమాపై అంచనాలు కూడ తారాస్థాయిలోనే ఉన్నాయి. ప్రేక్షకులంతా సావిత్రి గురించిన ఎలాంటి విశేషాలు, ముఖ్యమైన సంగతులు తెరమీద కనిపిస్తాయో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో టైటిల్ రోల్ చేయగా సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.

Exit mobile version