మహేష్ బాబు సినిమాని టార్గెట్ చేసిన ‘మహానటి’ !

Published on May 29, 2018 9:31 am IST

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ రూపొందించిన ‘మహానటి’ చిత్రం ఓవర్సీస్ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది. అక్కడి తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. చాలా సులభంగా ఒకటిన్నర మిలియన్లను అందుకున్న ఈ సినిమా ఆ తరవాత కూడ అదే జోరు కొనసాగిస్తూ ఇప్పుడు రెండున్న మిలియన్లను రాబట్టుకుని ఇంకా కొన్ని లోకేషన్లలో నడుస్తూనే ఉంది.

ఇప్పటికే ఉత్తమ వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో ‘ఖైదీ నెం 150, అ..ఆ’ వంటి సినిమాలని అధిగమించిన ఈ చిత్రం 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ చిత్రానికి ముందు స్థానంలో 2.89 డాలర్లతో మహేష్ యొక్క ‘శ్రీమంతుడు’ ఉండగా ‘మహానటి’ దూకుడు చూస్తుంటే ఆ చిత్రాన్ని కూడ అధిగమించే అవకాశాలు లేకపోలేదనిపిస్తోంది. మరి ఫుల్ రన్ ముగిసేనాటికి ‘మహానటి’మహేష్ బాబు సినిమాని అందుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :