అలాంటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపోందిన సినిమా ‘మహానటి’. సావిత్రిగారి జీవితంలోని బయటకు తెలియని ఎన్నో నిజాల్ని, అంశాలని ఈ చిత్రం ద్వారా చూపెడతామని దర్శకుడు నాగ్ అశ్విన్ అండ్ టీమ్ అంటున్నారు. దీంతో మొదటి నుండి సావిత్రిగారి వ్యక్తిగత జీవితంపై రకరకాల పుకార్లు వింటూ వస్తున్న ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మొదలైంది.
కానీ చిత్ర యూనిట్ మాత్రం సినిమా విడుదలకు ముందే కొన్ని కొన్ని ఆసక్తికరమైన రహస్యాలని బయటపెడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తొలుత వింటేజ్ కార్లంటే ఎక్కువగా ఇష్టపడే సావిత్రిగారి దగ్గర చెన్నైలోనే ఎవరిదగ్గరా లేనంత కార్ల కెల్క్షన్ ఉండేదని చెప్పిన టీమ్ సభ్యులు ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక నటి సావిత్రిగారని, అలాగే సావిత్రిగారికి జెమినీ గణేశన్ తో వివాహమైందనే రహస్యం ఆమె లక్స్ వాణిజ్య ప్రకటన అగ్రిమెంట్ మీద అనుకోకుండా సావిత్రి గణేశన్ అని సంతకం చేసినప్పుడే బయటపడిందనే ఆసక్తికరమైన విశేషాల్ని బయటపెట్టారు.
మరి సినిమాకు ముందే ఇన్ని రహస్యాల్ని చెబుతున్న టీమ్ సినిమాలో ఇనీకెన్ని ఆశ్చర్యకరమైన అంశాలను చూపెడతారో చూడాలి.
