‘మహానటి’ పై పెరుగుతున్న అంచనాలు !


కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న చిత్రం ‘మహానటి’. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆరంభం నుండే అందరిలోనూ అంచనాల్ని రేకెత్తిస్తూ వస్తోంది. దానికి తోడు ఇటీవలే విడుదలైన టీజర్లో సావిత్రి గెటప్లో నటి కీర్తి సురేష్ గొప్పగా కనిపిస్తూ ప్రదర్శించిన అద్భుతమైన అభినయం, పాతకాలపు రోజుల్ని తలపించేలా ఉన్న నాగ్ అశ్విన్ టేకింగ్ కలిసి ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి మరింత ఎక్కుయ్యేలా చేశాయి.

విడుదలైన కొద్దిసేపటికే టీజర్ కు మిలియన్ వ్యూస్ దక్కగా ఇప్పటి వరకు 3 మిలియన్ల వ్యూస్ లభించాయి. తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం మూడు పరిశ్రమలను ఆకట్టుకునేలా ఉండటం కోసం దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత, నాగ చైతన్య వంటి స్టార్ నటీ నటులచేత ముఖ్యమైన పాత్రల్ని వేయించారు.

ఇకపోతే వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.