మహానటి కలక్షన్స్ !

మహానటి కలక్షన్స్ !

Published on Jul 3, 2018 10:00 PM IST

Mahanati1

అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆదరంగా తెరకెక్కిన చిత్రం మహానటి. కీర్తి సురేష్ ప్రదాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ రికార్డు కలెక్షన్స్ ను ఖాతాలో వేసుకుంది. కొద్దీ రోజుల క్రిందట 50రోజులను పూర్తిచేసుకున్న ఈచిత్రం తెలుగు , తమిళ భాషల్లో కలిపి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.75కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇక సౌత్ లోనే రూ .42.5కోట్ల షేరును రాబట్టిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా సరికొత్త రికార్డు నెలకొల్పింది ఈ చిత్రం.

ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ , సమంత , విజయ్ దేవరకొండలు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు