గట్టి పోటీ మధ్యన కూడా భారీగా విడుదలవుతున్న ‘మహానుభావుడు’ !

26th, September 2017 - 03:23:22 PM


యంగ్ హీరో శర్వానంద్ చిత్రం మరోసారి భారీ పోటీ నడుమ విడుదలకు సిద్ధమైంది. ఒకవైపు ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ కలెక్షన్లతో దూసుకుపోతుంటే రేపు మహేష్ బాబు ‘స్పైడర్’ భారీ ఎత్తున రిలీజవుతోంది. ఇంత పోటీ మధ్యన రావాలనుకున్నా కూడా ‘మహానుభావుడు’ కి థియేటర్లు దొరుకుతాయా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. కానీ మేకర్స్ మాత్రం విడుదలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఎక్కువ సంఖ్యలోనే థియేటర్లను పట్టుకున్నారు.

ఎందుకంటే గుంటూరు, నెల్లూరు, సీడెడ్లలో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, నైజాం, వైజాగ్ లలో దిల్ రాజు, ఉభయ గోదావరి జిల్లాలో గీతా ఆర్ట్స్ వంటి ప్రముఖులు చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో సినిమాకు సుమారు 400 లకు పైగానే స్క్రీన్లు దొరికాయి. టాక్ బాగుండి, పెద్ద సినిమాల హడావుడి కాస్త తగ్గితే ఇవి మొత్తం ఇంకాస్త పెరిగే ఛాన్సుంది. ఇక ఓవర్సీస్లో సైతం ‘స్పైడర్, జై లవ కుశ’ హవా నడుస్తున్నా కూడా సుమారు 125 కి పైగా లొకేషన్లలో థియేటర్లను పొందగలిగింది ఈ చిత్రం.