గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ చేతికి మహర్షి ఓవర్సీస్ హక్కులు !

Published on Apr 10, 2019 3:00 am IST

మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదల చేయనుంది ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గ్రేట్ ఇండియా ఫిలిమ్స్. అయితే ఈ హక్కులను ఎంతకు సొంతం చేసుకుందో తెలియాల్సి వుంది. ఇక ఈ సంస్థ ఇంతకుముందు మహేష్ నటించిన అతడు , పోకిరి , భరత్ అనే నేను చిత్రాలను అక్కడ విడుదలచేయగా ఈ మూడు మంచి విజయాలు సాధించాయి. మరి ఈ మహర్షి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం మే 9న గ్రాండ్ గా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :