భారీ ధరకు మహర్షి సీడెడ్ రైట్స్ !

Published on Apr 9, 2019 12:30 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వచిత్రం ‘మహర్షి’ ఒక్క సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెల 15నుండి ఈ సాంగ్ చిత్రీకరణ జరుపనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా మహేష్ తన పాత్ర కు డబ్బింగ్ చెబుతున్నారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ చిత్రం యొక్క సీడెడ్ రైట్స్ 12.6కోట్లకు అమ్మడైయ్యాయని సమాచారం.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమా ఫై అంచనాలు రెట్టింపయ్యాయి. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వినీ దత్ , పీవీపీ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :