‘మహర్షి’ ఎఫెక్ట్.. ఊపందుకున్న వీకెండ్ వ్యవసాయం !

Published on May 12, 2019 6:50 pm IST

తాజాగా విడుదలైన మహేష్ ‘మహర్షి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. వసూళ్లు బాగున్నాయి. సినిమాలో రైతుల సమస్యలను ప్రస్తావించడం, రైతుకి కావాల్సింది సానుభూతి కాదు గౌరవం అంటూ చెప్పడం, కొన్ని సమస్యలకు వీకెండ్ వ్యవసాయం ద్వారా పరిష్కారం చెప్పే ప్రయత్నం చేయడం ప్రేక్షకుల్ని, అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది.

సినిమాను స్ఫూర్తిగా తీసుకుని చాలామంది యువతీ యువకులు పొలాల వైపు నడుస్తున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో వీకెండ్ వ్యవసాయం చేసేందుకు నడుం బిగించారు. పొలాల్లో పనిచేస్తూ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మంచి ఆలోచన కల్పించినందుకు మహేష్ బాబుకు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. మహేష్ సైతం ప్రేక్షకులు సినిమా చూసి వ్యవసాయం పట్ల మొగ్గుచూపడాన్ని అభినందిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్, పివిపిలు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More