మహేశ్ ‘మహర్షి’ ఫస్ట్ సింగల్ కి డేట్ ఫిక్స్ !

Published on Mar 25, 2019 9:27 pm IST

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ అందింది. మహర్షి సినిమా ఫస్ట్ సింగల్ ను మరో నాలుగు రోజుల్లో మార్చి 29వ తేదీన విడుదల చెయ్యనున్నారు. ఇక ఈ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్నది. ఈ చిత్రానికి మ్యూజిక్ సంచలనం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక మహర్షిలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More