కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ‘మహర్షి’ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ !

Published on May 14, 2019 9:49 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’.. గుంటూరు మరియు కృష్ణా జిల్లాల్లో ఐదో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

ముందుగా గుంటూరు విషయానికి వస్తే.. గుంటూరులో మహర్షి ఐదో రోజు షేర్ 22.5 లక్షలుగా ఉంది. మొత్తం ఐదు రోజులకు గానూ మాహర్షి గుంటూరులో 6.125 కోట్లును రాబట్టాడు.

అలాగే కృష్ణా జిల్లాలో కూడా మహర్షి ఐదో రోజు షేర్ 27.4 లక్షలు రాగా.. మొత్తం ఐదు రోజులకుగానూ మాహర్షి కృష్ణా లో 3.90 కోట్లను కలెక్ట్ చేశాడు.

సోమవారం నాడు కూడా కృష్ణ మరియు గుంటూరు జిల్లాల్లో.. ‘మహర్షి’ ఈ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టడం నిజంగా విశేషమే. మహేశ్ కెరీర్ లోనే ఇవి బిగ్గెస్ట్ కలెక్షన్స్. మొత్తానికి ఈ చిత్రంతో మహేష్ తన కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ను అందుకున్నాడు.

సంబంధిత సమాచారం :

More