“మహర్షి” మూవీ విజయోత్సవ వేడుక రద్దు

Published on Jun 27, 2019 10:18 am IST

నటి,దర్శకనిర్మాత విజయ నిర్మల హఠాన్మరణం చిత్రపరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నేటి ఉదయం నటి విజయ నిర్మల ఇకలేరన్న దుర్వార్తతో మొదలుకావడం బాధాకరం. సినీ ప్రముఖులతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞ కలిగిన ఐరన్ లేడీ విజయనిర్మల లేరన్న వార్త ఆమె అభిమానులను తీవ్ర దుఃఖంలో ముంచివేసింది.

ఈ కారణంగా రేపు శిల్పకళా వేదికలో జరగాల్సిన “మహర్షి” మూవీ విజయోత్సవ వేడుకను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన “మహర్షి” 50 రోజులు 200ల సెంటర్స్ లో ప్రదర్శించబడిన కారణంగా రేపు ఈ వేడుక జరగాల్సివుంది.

సంబంధిత సమాచారం :

More