స్పెషల్ డే కి మహర్షి టీజర్ !

Published on Apr 3, 2019 4:12 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వచిత్రం ‘మహర్షి’ టీజర్ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఈ టీజర్ ఏప్రిల్ 6న ఉగాది కానుకగా విడుదలకానుంది సమాచారం. ఇప్పటికే మహేష్ దానికి సంబందించిన డబ్బింగ్ ను కంప్లీట్ చేశారు. రేపు ఈ టీజర్ గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా ప్రముఖ హీరో అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మే 9న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :