మహర్షి టీజర్ విడుదలకు టైం ఫిక్స్ !

Published on Apr 4, 2019 4:34 pm IST

గత ఏడాది సమ్మర్ కి భరత్ అనే నేను సినిమా తో వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఈ సమ్మర్ కి మహేష్ ‘మహర్షి’ చిత్రం తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఈ చిత్రం మే 9న విడుదలకానుంది. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను ఉగాది పండగ రోజు ఏప్రిల్ 6న ఉదయం 9:09 గంటలకు విడుదలచేయనున్నారు.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా ప్రముఖ హీరో అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్ పాత్రలో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :