‘మహర్షి’ లేటెస్ట్ నైజాం కలెక్షన్స్ !

‘మహర్షి’ లేటెస్ట్ నైజాం కలెక్షన్స్ !

Published on May 13, 2019 8:59 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మహేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబడుతున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది. కాగా మాహర్షి నైజాం కలెక్షన్స్ కూడా శుక్రవారం కంటే శనిఆదివారాల్లో ఎక్కువగా వచ్చాయి.

ఆదివారం నాడు మహర్షి నైజాంలో 3.47 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజాంలో మహర్షి మొత్తం నాలుగు రోజుల షేర్ 16.61 కోట్లుగా ఉంది. మొత్తానికి నైజాంలో మహేశ్ మార్కెట్ రేంజ్ ‘మహర్షి’ మరోసారి గుర్తు చేశాడు. గతంలో కూడా మహేశ్ సూపర్ హిట్ చిత్రాలు నైజాంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. కానీ ‘మహర్షి’ వాటన్నిటినీ దాటేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు