‘మహర్షి’ మూడో రోజు కలెక్షన్స్ !

Published on May 12, 2019 11:09 am IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం నైజాం లాంటి కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది.

మొత్తానికి ఈ చిత్రంతో మహేష్ తన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్నాడు. కాగా మహర్షి మూడో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏరియాల వారిగా ‘మహర్షి’ మూడవ రోజు వసూళ్ల వివరాలు పరిశీలిస్తే…

ముందుగా నైజాంలో మహర్షి మూడో రోజు 3.47 కోట్ల షేర్ గా ఉంది. అలాగే మొత్తం మూడు రోజులకుగానూ మాహర్షి నైజాం షేర్ 13.14 కోట్లుగా ఉంది.

ఇక గుంటూరు విషయానికి వస్తే.. గుంటూరులో మహర్షి మూడో రోజు షేర్ 44.79 లక్షలుగా ఉంది. మొత్తం మూడు రోజులకుగానూ మాహర్షి గుంటూరులో 5.35 కోట్లును రాబట్టాడు.

ఇక తూర్పు గోదావరిలో మహర్షి మూడో రోజు షేర్ 59 లక్షలు.. అలాగే మొత్తం మూడు రోజులకుగానూ మాహర్షి తూర్పు గోదావరిలో 4.39 కోట్లును కలెక్ట్ చేశాడు.

పశ్చిమ గోదావరిలో మహర్షి మూడో రోజు షేర్ 41 లక్షలుగా ఉంది. మొత్తం మూడు రోజులకుగానూ మాహర్షి పశ్చిమ గోదావరిలో 3.31 కోట్లును సాధించాడు.

సంబంధిత సమాచారం :

More