జూన్ రెండవ వారం నుండి మహేష్ బాబు సినిమా !
Published on May 29, 2018 3:37 pm IST

రెండేళ్లుగా సాలిడ్ హిట్ లేని సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ‘భరత్ అనే నేను’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకుని రెట్టించిన ఉత్సాహంతో తన సిల్వర్ జూబ్లీ సినిమాకు సిద్ధమవుతున్నారు. మహేష్ కెరీర్లో ల్యాండ్ మార్క్ చిత్రమైన ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్నారు. చాలా వరకు లండన్ నేపథ్యంలో జరిగే ఈ సినిమా జూన్ 2వ వారం నుండి మొదలుకానుంది.

ఇప్పటికే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ కంపోజింగ్ కూడ మొదలుపెట్టేశారు. పూజా హెగ్డే కథానాయకిగా నటించనున్న ఈ చిత్రానికి కె.యు.మోహన్ సినిమాటోగ్రఫీ అందివ్వనున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇందులో మహేష్ క్లీన్ షేవ్ తో కాకుండా కొంచెం గెడ్డంతో రఫ్ లుక్ తో కనిపిస్తారట.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook