‘మహేష్ 25’ టైటిల్ , ఫస్ట్ లుక్ ఆరోజే విడుదలకానుందా ?

Published on Jul 10, 2018 8:25 pm IST


‘భరత్ అనే నేను’ భారీ విజయం తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డెహ్రాడూన్ లో షూటింగ్ ముగించుకొని చిత్ర యూనిట్ హైదరాబాద్ కు రానుందని సమాచారం.
ఇక ఈ చిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను మహేష్ బర్త్ డే సందర్బంగా ఆగష్టు 9న విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. అయితే ఈ వార్తను అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ఇప్పటికే మహేష్ అభిమానులు ఆయన పుట్టినరోజును భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ వార్త కూడా నిజమైతే అభిమానులకు ఇంతకన్నా ఆనందం ఏముంటుంది.

పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్, పివిపిలు కలిసి నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :