ప్రభాస్ కి మహేష్, చిరుల ప్రత్యేక శుభాకాంక్షలు.!

Published on Oct 23, 2021 4:28 pm IST

ఈరోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా నిన్న సాయంత్రం నుంచే సోషల్ మీడియాలో హంగామా షురూ అయ్యిపోయింది. అయితే ఇక ఈరోజు భారతదేశంలోని పలువురి సినీ దిగ్గజాలే తమ స్పెషల్ విషెష్ ని ప్రభాస్ కి తెలియజేసారు. అయితే వీటిని మరింత స్పెషల్ గా చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మెగాస్టార్ చిరంజీవి లు కూడా ప్రభాస్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు.

మహేష్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ కి బర్త్ డే విషెష్ తెలుపుతూ తనకి మరో ఫినానిమల్ ఇయర్ రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే మెగాస్టార్ చిరు కూడా ఇదే తరహాలో ప్రభాస్ ని తన ఊతపదం డార్లింగ్ అంటూనే వండర్ ఫుల్ ఇయర్ గా ఇది నీకు ఉండాలని కోరుకుంటూ అందరి ఆశీస్సులు ఉండాలని తన శుభాకాంక్షలు తెలియజేసారు. దీనితో ముగ్గురి హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :