ఫోటోగ్రాఫర్స్ తో ఆడుకున్న ఎన్టీఆర్ అండ్ మహేష్

Published on Feb 29, 2020 10:42 pm IST

సెలెబ్రిటీలు కనబడితో ఫోటో తీయడం, ఫోటో దిగడానికి తాపత్రయ పడడం అనేది చాలా కామన్. ఇక స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ ఐతే వేరే చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళ అభిమాన హీరోతో ఫోటో దిగి ఫ్రెండ్స్ దగ్గర ఫోజ్ కొట్టాలని చూసేవారు చాలా మంది ఉంటారు. ఐతే స్టార్ హీరో హీరోయిన్లను ఫోటోలు తీయడం మరో ప్రక్కన వృత్తిగా కూడా ఉంది. చాల రకాల ఫిల్మ్ వెబ్ సైట్స్, జర్నల్స్ కి సెలెబ్రిటీల ఫోటోలు అవసరం. దీని కోసం కొందరు కెమెరా పట్టుకొని స్టార్స్ కోసం కాపు కాచుకొని కూర్చుంటారు.

సాధారణంగా షూటింగ్స్ కోసం, విహారాల కోసం, పర్సనల్ వర్క్ కోసం ఎయిర్ పోర్ట్స్ కి ఖచ్చితంగా వస్తూ ఉంటారు తారలు. అందుకే ముఖ్యంగా చాల మంది ఫోటోగ్రాఫర్స్ ఎయిర్ పోర్ట్స్ ఎంట్రన్స్, ఎగ్జిట్స్ దగ్గర వేచి చూస్తూ కూర్చుంటారు. వీరిలో ఒకరికి మహేష్ ఝలక్ ఇవ్వగా, ఎన్టీఆర్ సెటైర్ వేశారు. ఈ మధ్య మహేష్ ఓ ఫోటోగ్రాఫర్ తో ‘ఎప్పుడూ ఇదే పనేనా.. బోరుకొట్టడంలా’ అని అడిగారు. ఎన్టీఆర్ కూడా ఓ ఫోటో గ్రాఫర్ ‘ఇంటికి వెళుతున్నావా లేదా అసలు ఇక్కడే వుంటున్నావా…’ అని సెటైర్ వేశారు.

సంబంధిత సమాచారం :