మహేశ్ బాబు, సితారతో సెల్ఫీకి ఫోజిచ్చిన ఐరన్ మ్యాన్..!

Published on Dec 26, 2021 12:02 am IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. మహేశ్ ఎక్కువగా కూతురు సితార, కొడుకు గౌతమ్ తో కలిసి ఉన్న ఫోటోలను, వారితో ఎంజాయ్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటాడు. అయితే తాజాగా మహేశ్ బాబు కూతురు సితారతో కలిసి ఐరన్ మ్యాన్‌తో సెల్ఫీ తీసుకున్నాడు.

ఆ ఫోటోలో మహేశ్ బాబు, సితార ఇద్దరు మాస్క్‌లు పెట్టుకుని కనిపిస్తున్నారు. వీరిద్దరి వెనుక ఉన్న ఐరన్ మ్యాన్ బొమ్మ సెల్ఫీ కోసం ఫోజ్ ఇచ్చినట్టు కెమెరా వైపే చూస్తుంది. ఈ పిక్‌ని షేర్ చేస్తూ మహేశ్ క్రిస్మస్ విషెష్ తెలియచేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :