వేరే లెవెల్లో సూపర్ స్టార్, థలపతిల అకౌంట్ల హవా.!

Published on Sep 23, 2020 1:03 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కు ఆన్లైన్ అయినా సరే ఆఫ్ లైన్ అయినా సరే ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అదే విధంగా కోలీవుడ్ లో ఇళయ థలపతి విజయ్ కూడా ఒకరు. అయితే ఈ ఇద్దరు సోషల్ మీడియా రీచ్ మాత్రం మామూలు రేంజ్ లో ఉండదని చెప్పాలి.

ఫాలోయర్స్ సంగతి పక్కన పెడితే యమ యాక్టీవ్ గా రీచ్ వచ్చే ట్విట్టర్ హ్యాండిల్స్ జాబితాలో మన ఇండియాలోనే వీరిద్దరి ట్విట్టర్ హ్యాండిల్స్ స్పెషల్ ప్లేస్ ను ఆక్రమించుకున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఉదాహరణగా వీరు పెట్టె పోస్టులకు వచ్చే రీచ్ నే చెప్పొచ్చు.

లక్షకు పైగా లైక్స్ దాటిన పోస్టులు సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాండిల్ నుంచి 14 ఉండగా థలపతి విజయ్ నుంచి 19 ఉన్నాయి. దీనితో మన దేశంలోనే వీరిద్దరి ట్విట్టర్ అకౌంట్స్ మోస్ట్ ఇంఫ్లుయెన్షల్ హ్యాండిల్స్ గా అంటే మన దేశంలోనే అత్యంత ప్రభావిత ట్విట్టర్ ఖాతాలుగా నిలిచాయని సినీ ట్రాకర్స్ అంటున్నారు. ప్రస్తుతం విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్” రిలీజ్ కోసం ఎదురు చూస్తుండగా మహేష్ నటించనున్న “సర్కారు వారి పాట” పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది.

సంబంధిత సమాచారం :

More