మహేష్, త్రివిక్రమ్ ల ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ అప్పుడే.?

Published on May 2, 2021 8:43 am IST

టాలీవుడ్ మరో మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ కాంబో ఎట్టకేలకు నిన్నటితో సెట్టయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం చాన్నాళ్లుగా అంతా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ క్లాసికల్ కాంబో సెట్టయ్యి ఆ హైప్ ను తెచ్చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ చాలా పనులు కంప్లీట్ చేసేసుకున్న ఈ చిత్రంపై లేటెస్ట్ బజ్ ఇంకొకటి వినిపిస్తుంది.

ఈ చిత్రం తాలుకా టైటిల్ అనౌన్సమెంట్ ఎప్పుడు అన్నదానిపై టాక్ వినిపిస్తుంది. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా టైటిల్ ను ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేయనున్నారని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే. అలాగే అదే రోజున మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట నుంచి కూడా ఓ సాలిడ్ అప్డేట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :