సుధీర్ బాబు, అదితిరావు హైదరి జంటగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. జూన్ 10 న హైదరాబాద్ లో జరిగే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు ముఖ్య అతిధిగా రానున్నారు . జూన్ 15న విడుదల కానున్న ఈ సినిమా ఫై చాలా ఆశలు పెట్టుకున్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం అయన ఈ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఇక నిన్న సూపర్ స్టార్ కృష్ణ రిలీజ్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇకపోతే అదితిరావు హైదరికి తెలుగులో ఇదే మొదటి సినిమా కావడంతో ఈ సినిమా ఫై ఆమె మంచి హోప్స్ పెట్టుకున్నారు.
