“శ్రీదేవి సోడా సెంటర్” సినిమాపై మహేశ్ బాబు ప్రశంసలు..!

Published on Aug 28, 2021 1:00 am IST

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం పాజిటిబ్ బజ్ మధ్య విడుదలై హిట్ టాక్‌ని తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకు పలువురి ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

సుధీర్ బాబు బావమరిది సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా “శ్రీదేవి సోడా సెంటర్” మూవీని తన ఇంట్లోని మినీ థియేటర్లో చూసి ఎంజాయ్ చేశాడు. అనంతరం ట్విట్టర్‌లో సినిమాపై ప్రశంసలు గుప్పించాడు. పలాస 1978 తర్వాత దర్శకుడు కరుణ కుమార్ మంచి కంటెంట్ సినిమాతో వచ్చాడని, ఈ సినిమా చాలా కష్టమైన క్లైమాక్స్‌తో కూడుకుందని అన్నారు. సినిమాలో సుధీర్ బాబు నటన అద్భుతంగా ఉందని, ఇందులో అతడి నటన అత్యుత్తమమని చెప్పుకోవచ్చు అని అన్నారు. సీనియర్ నటుడు నరేష్, హీరోయిన్ ఆనంది నటన మరియు మణిశర్మ మ్యూజిక్ కంపోజింగ్ చాలా బాగుందని, అద్భుతమైన విజువల్స్ మరియు అత్యుత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మంచి ప్లస్ అయ్యిందని ట్వీట్ చేస్తూ మరోసారి చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపుతున్నట్టు ట్వీట్ చేశాడు.

సంబంధిత సమాచారం :