మహేశ్ కొత్త సినిమా స్క్రిప్ట్ పూర్తయిందట !

Published on Mar 18, 2019 12:32 pm IST

అనిల్ రావిపూడి తన తరువాత సినిమాను మహేశ్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. కాగా జూలై నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా అనిల్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తి చేశారట. అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి తోడు స్క్రిప్ట్ లో మంచి యాక్షన్ అంశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే మహేశ్ బాబు సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :