తన కొడుకుతో హైట్ చెక్ చేసుకున్న మహేశ్.. ఎవరెక్కువ ఎత్తంటే..!

Published on May 23, 2020 2:31 am IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ మధ్యన ఫ్యామిలీతో బాగా గడుపుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు, సినిమాలు ఆగిపోవడంతో ఇంట్లోనే ఉంటూ తన పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. తన పిల్లలతో గేమ్స్ ఆడుకుంటూ, స్విమ్మింగ్ చేసుకుంటూ కనిపిస్తున్న మహేశ్ ఇంటి దగ్గర సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు.

అయితే తాజాగా తన కొడుకుతో మహేశ్ హైట్ చెక్ చేసుకున్నారు. మహేశ్ కంటే గౌతమ్ కాస్త తక్కువ హైట్ ఉన్నాడు. అయితే మహేశ్ లుక్ చూస్తుంటే గౌతమ్ కి మహేశ్‌కి బ్రదర్ అనేలా ఉన్నాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :

More