ఫిఫా 2014 స్పెయిన్ కైవసం కావాలనుకుంటున్న మహేష్ బాబు

mahesh-babu-fifa
ప్రస్తుతం ప్రపంచం అంతా మరియు మీడియాలో వినిపిస్తున్న పేరు ఫిఫా సాకర్ వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ నిన్ననే బ్రెజిల్ లో ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లోనే బ్రెజిల్ క్రొయాటియాపై గెలుపొందింది. ప్రస్తుతం అన్ని చోట్లా ఉన్న ఈ ఫుట్ బాల్ ఫీవర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా ఉంది.

మహేష్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఈ సంవత్సరం ఫిఫా వరల్డ్ కప్ స్పెయిన్ గెలుచుకోవాలి. క్రిస్టియానో రొనాల్డో నాకు ఇష్టమైన ప్లేర్ అని’ అన్నాడు. అలాగే మాట్లాడుతూ ఈ వరల్డ్ కప్ ఫైనల్ లో బ్రెజిల్ – స్పెయిన్ తలపాడాలనుకుంటున్నానని తన మనసులో మాటని బయట పెట్టాడు. ఈ ఫిఫా వరల్డ్ కప్ కోసం ఈ నెల 32 టీం లు తలపడనున్నాయి. మరి మహేష్ కోరుకున్నట్టు స్పెయిన్ కప్పు గెలుస్తుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

Exit mobile version