
గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ షూటింగ్ పూర్తవడంతో మహేష్ బాబు ఇక తన దృష్టంతా బ్రహ్మోత్సవం సినిమాపై పెట్టనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్న బ్రహ్మోత్సవం సినిమా జూలై 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేసారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణితలు ఈ సినిమాలో మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్నారు.
ఈ సినిమా షూటింగ్ కి వెళ్ళడానికి ముందే ఈ చిత్ర టీం రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. జూలై 10 నుంచి షూటింగ్ మొదలు పెట్టి డిసెంబర్ కల్లా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి 2016 సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించారు. మహేష్ బాబు – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, రేవతి, జయసుధ, నరేష్ లు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.