సమ్మర్ హీట్ ని తట్టుకొని షూట్ చేస్తున్న మహేష్ బాబు

Published on May 2, 2014 11:25 am IST

Mahesh-Babu-Aagadu
ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి, హైదరాబాద్ లో ప్రతి రోజు 42-43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక సినిమాల పరంగా వస్తే రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో వేడి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఇంత వేడిని తట్టుకోవడం హీరో, హీరోయిన్, మిగతా నటీనటులకు చాలా కష్టమైన పని.

ఇంత కష్టమైనప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడం లేదు. మహేష్ బాబు చేస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ కోసం సమ్మర్ హీట్ ని కూడా తట్టుకొని గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నాడు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :