హైదరాబాద్ లో బిజీగా మహేష్ బాబు

హైదరాబాద్ లో బిజీగా మహేష్ బాబు

Published on May 7, 2015 3:34 AM IST

Mahesh-babu
ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివదర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసినదే. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే పేరు పరిశీలనలో వుంది. ఈ చిత్ర షూటింగ్ ని శరవేగంగా జరుపుకుంటూ జూలై 17న విడుదలకు సిద్ధంచేస్తున్నారు. చిత్ర బృందం ఇటీవలే మలేసియాలో షూటింగ్ జరుపుకుని హైదరాబాద్ తిరిగొచ్చారు.

ప్రస్తుతం మహేష్ బాబు, సంపత్ ల మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. శృతిహాసన్ కధానాయిక.

ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు తదితర వివరాలు ఈ నెల 31న వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు