మరోసారి సుధీర్ బాబుకి మహేష్ బాబు సపోర్ట్!!

మరోసారి సుధీర్ బాబుకి మహేష్ బాబు సపోర్ట్!!

Published on Nov 13, 2015 9:33 PM IST

Bhale-ManchiRoju
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ గారి తర్వాత వచ్చిన వారసుడు సూపర్ స్తా మహేష్ బాబు. ఆ తర్వత ఘట్టమనేని సపోర్ట్ తో వచ్చిన యంగ్ హీరో సుధీర్ బాబు. మొదటి నుంచి సుధీర్ బాబు సపోర్ట్ చేయడం కోసం మహేష్ బాబు ఎప్పుడూ ముందున్నాడు. దాదాపు అన్ని సుధీర్ బాబు ఆడియో ఫంక్షన్స్ కి వచ్చి సుధీర్ బాబుకి బ్యాక్ పిల్లర్ గా నిలిచాడు. ఈ ఏడాది ‘మోసగాళ్ళకు మోసగాడు’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాల తర్వాత సుధీర్ బాబు నుంచి రానున్న మొదావ సినిమా ‘భలే మంచి రోజు’.

షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆడియోని నవంబర్ 25న హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. ఈ ఆడియో లాంచ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అథిదిగా హాజరు కానున్నాడు. దాంతో ఈ చిత్ర టీం ఈ వేడుక కోసం ఓ గ్రాండ్ వేదికని వెతికే పనిలో ఉంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో చండీఘర్ బ్యూటీ వమిక గబ్బి హీరోయిన్ గా పరిచయం కానుంది. సుధీర్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన విజయ్ – శశి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. సన్నీ ఎంఆర్ మ్యూజిక్ మరియు శాందత్ విజువల్స్ కూడా ఈ సినిమాకి స్పెషల్ హెల్ప్ అవుతాయని ఫస్ట్ టీజర్ చూసిన వారు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు