‘రొమాంచకం’కి ఫస్ట్ ఎవర్ రివ్యూ: సూపర్ స్టార్ పోస్ట్ వైరల్

‘రొమాంచకం’కి ఫస్ట్ ఎవర్ రివ్యూ: సూపర్ స్టార్ పోస్ట్ వైరల్

Published on Sep 2, 2026 11:00 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా ఆనంతిక సనీల్ కుమార్ హీరోయిన్ గా దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమే రొమాంచకం. మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమాని పాపులర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ పైడ్ ప్రీమియర్స్ తో మొదలైన ఈ సినిమాపై ఫస్ట్ ఎవర్ రివ్యూ అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్ నుంచి రావడం వైరల్ గా మారింది.

రొమాంచకం చాలా ఎంటర్టైనింగ్ గా ఉందని మహేష్ సర్టిఫై చేసారు. అంతేకాకుండా సందీప్, ప్రణయ్ మరియు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపి ఈ ప్రాజెక్టులో నిండిన ప్రేమ, ఫ్యాషన్ మరియు హార్డ్ వర్క్ స్పష్టంగా కనిపిస్తాయి, అలాగే అందుకు తగ్గ మంచి ఫలితాన్ని మీరు వెనక్కి తిరిగి పొందాలని ఆశిస్తున్నాను అని మహేష్ తనదైన శైలిలో పోస్ట్ చేసారు. దీనితో రొమాంచకం కి ఫస్ట్ ఎవర్ బిగ్ ఆడియెన్ గా మహేష్ ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది.

తాజా వార్తలు