ట్రేండింగ్ లిస్ట్‌లో టాప్ ప్లేస్ లో నిలిచిన మహేష్ బాబు !

ట్రేండింగ్ లిస్ట్‌లో టాప్ ప్లేస్ లో నిలిచిన మహేష్ బాబు !

Published on Aug 10, 2018 12:44 PM IST

Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ కి మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.

ప్రస్తుతం ‘మహర్షి’ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తూ.. యూ ట్యూబ్ ట్రేండింగ్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో నిలవటం నిజంగా విశేషమే. మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో విడుదల అవ్వడానికి సన్నాహాలు జరుపుకుంటుంది.

తాజా వార్తలు