యూరప్ పయనమైన మహేష్ బాబు

Published on Aug 11, 2014 7:19 pm IST

aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాని త్వరగా ఫినిష్ చేసి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసే పనిలో ఉన్నాడు. నేటితో హైదరాబాద్ లో షూట్ చేస్తున్న క్లైమాక్స్ ఎపిసోడ్ ని పూర్తి చేసిన మహేష్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఈ రోజు రాత్రి యూరప్ కి బయలు దేరుతున్నాడు. ఈ సినిమాలో మిగిలి ఉన్న రెండు పాటలను అక్కడి అందమైన లోకేషన్స్ లో షూట్ చేయనున్నారు. ఆగష్టు 23 వరకూ ‘ఆగడు’ షూటింగ్ యూరప్ లో జరగనుంది. తమన్నా కూడా యూరప్ లో ఈ చిత్ర టీంతో కలవనుంది.

యూరప్ నుంచి తిరిగి వచ్చాక ఏమన్నా పాచ్ వర్క్ సీన్స్ ఉంటే ఫినిష్ చేసిన తర్వాత మహేష్ బాబు తన పార్ట్ కి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టనున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఓ స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ కనిపించనున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :