మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్ర “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు పక్కా ప్లానింగ్ ప్రకారం జరుగుతుండగా ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ అయితే ఈ సెప్టెంబరు 1 నుంచి స్టార్ట్ కానుంది.
ఇక ఈ షూట్ ని అయితే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో మహేష్ బాబు స్టార్ట్ చేయనున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ల సారథ్యంలో త్రివిక్రమ్ తన మార్క్ ఇంట్రెస్టింగ్ ఫైట్ సీన్ ని డిజైన్ చేయగా మహేష్ ఈ 1నుంచి యాక్షన్ మోడ్ లోకి దిగబోతున్నాడు అని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేసేస్తున్నారు. దీనితో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదల కానుంది.


