
ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్‌పై మహేష్ మరొకసారి దర్శనమివ్వనున్నారు. దీనికి సంబంధించిన ఫోటో షూట్ కూడా ఇప్పటికే ముగిసింది. ఈ ఫోటోషూట్‌లో పూర్తి బ్లాక్ ఔట్ఫిట్తో ఫిల్మ్‌ఫేర్ అవార్డును చేతిలో పట్టుకొని ఉన్న మహేష్‌ను చూడొచ్చు. మహేష్ గతంలో కూడా ఫిల్మ్‌ఫేర్‌కు పోజులిచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకూ ఉత్తమ నటుడిగా నాలుగు సార్లు ఫిల్మ్‌ఫేర్ అందుకున్న మహేష్, ఐదో సారి కూడా ఈ అవార్డుకు ఎంపికైనట్టు తెలుస్తోంది. 2014లో విడుదలైన మహేష్ క్లాసిక్ సినిమా, ‘1 నేనొక్కడినే’ సినిమాకు ఆయన ఈ అవార్డును అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా.. త్వరలోనే శ్రీకాంత్ అడ్డాల ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్లో పాల్గొంటారు.

